పేకాట స్థావరంపై దాడి చేసిన పోలీసులు పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
పేకాట స్థావరంపై దాడి చేసిన పోలీసులు పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 23 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన కృష్ణా జిల్లా కంకిపాడు మండలం వేల్పూరు గ్రామంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఐదుగురు పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు.