తొలిసారి స్వయంప్రతిపత్తి హోదాలో పరీక్షలు | first time autonomus exams in arts college | Sakshi
Sakshi News home page

తొలిసారి స్వయంప్రతిపత్తి హోదాలో పరీక్షలు

Nov 24 2016 10:42 PM | Updated on Sep 26 2018 3:25 PM

ఆర్ట్స్‌ కళాశాలలో తొలిసారిగా స్వయం ప్రతిపత్తి హోదాలో సొంతంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎన్‌.రంగస్వామి ఓ ప్రకటనలో తెలిపారు.

– నేటి నుంచి ఆర్ట్స్‌ కళాశాల మొదటి సంవత్సరం పరీక్షలు
అనంతపురం ఎడ్యుకేషన్‌ : ఆర్ట్స్‌ కళాశాలలో తొలిసారిగా స్వయం ప్రతిపత్తి హోదాలో సొంతంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎన్‌.రంగస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. ఇన్నిరోజులూ ఎస్కేయూ పరిధిలో నిర్వహించిన ఈ కళాశాల శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే డిగ్రీ మొదటి సంవంత్సరం పరీక్షలు తామే నిర్వహిస్తున్నామని  పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి పరీక్షలుంటాయని వివరించారు. పరీక్షలకు 1,800 మంది విద్యార్థులు హాజరవుతారని కళాశాల కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డాక్టర్‌ ఎ. జానకీరామ్, వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పి. పద్మశ్రీ తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement