ఉద్యోగ వర్గానికి నష్టం చేకూర్చే కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని జిల్లా జేఏసీ చైర్మన్ హనుమంతు సాయిరాం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం శ్రీకాకుళంలోని ఎన్‌జీవో కార్యాలయం నుంచి పొట్టిశ్రీరాములు కూడలి వరకూ ర్యాలీగా వెళ్లి అక్కడ మానవహారం నిర్వహించనున్నట్లు తెలిపారు.
సీపీఎస్ వద్దే వద్దు
Aug 8 2016 11:24 PM | Updated on Sep 4 2017 8:25 AM
శ్రీకాకుళం అర్బన్: ఉద్యోగ వర్గానికి నష్టం చేకూర్చే కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని జిల్లా జేఏసీ చైర్మన్ హనుమంతు సాయిరాం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం శ్రీకాకుళంలోని ఎన్‌జీవో కార్యాలయం నుంచి పొట్టిశ్రీరాములు కూడలి వరకూ ర్యాలీగా వెళ్లి అక్కడ మానవహారం నిర్వహించనున్నట్లు తెలిపారు. అక్కడ నుంచి భారీ ర్యాలీతో కలెక్టరేట్‌కు చేరుకుని అక్కడ ఒకరోజు నిరాహారదీక్ష నిర్వహించడానికి కంట్రిబ్యూటరీ పెన్షన్ ఉద్యోగులు సమాయాత్తమైనట్లు పేర్కొన్నారు. ఈ దీక్షా శిబిరానికి ఎన్‌జీవో సంఘ రాష్ట్ర సహాధ్యక్షుడు చౌదరి పురుషోత్తమనాయుడు హాజరవుతారని తెలిపారు.
Advertisement


