సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అగ్నిప్రమాదం | Fire catches in Sub register office | Sakshi
Sakshi News home page

సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అగ్నిప్రమాదం

Aug 16 2016 9:42 AM | Updated on Sep 4 2017 9:31 AM

హిందూపురం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది.

హిందూపురం (అనంతపురం జిల్లా): హిందూపురం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనతో కార్యాలయంలోని విలువైన కంప్యూటర్లు, డాక్యుమెంట్లతో పాటు ఫర్నిచర్ కూడా కాలిబూడిదైంది.

సంఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సుమారు రూ.15 లక్షల ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement