breaking news
Computer fire
-
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం లో అగ్నిప్రమాదం
-
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అగ్నిప్రమాదం
హిందూపురం (అనంతపురం జిల్లా): హిందూపురం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనతో కార్యాలయంలోని విలువైన కంప్యూటర్లు, డాక్యుమెంట్లతో పాటు ఫర్నిచర్ కూడా కాలిబూడిదైంది. సంఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సుమారు రూ.15 లక్షల ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు.