గుంటూరు జిల్లా శావల్యపురం మండలం కృష్ణపురంలో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
శావల్యపురం(గుంటూరు):
గుంటూరు జిల్లా శావల్యపురం మండలం కృష్ణపురంలో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ జరగడంతో.. మంటలంటుకొని రెండిళ్లు కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో రూ. 10 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం.
విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.