షార్ట్‌సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం | fire accident due to short circuit in athili | Sakshi
Sakshi News home page

షార్ట్‌సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం

Aug 5 2016 10:05 AM | Updated on Sep 5 2018 9:47 PM

పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం వరిగేడు గ్రామంలో అగ్నిప్రమాదం సంభవించింది.

ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం వరిగేడు గ్రామంలో అగ్నిప్రమాదం సంభవించింది. అద్దాల కాశీ విశ్వనాథం ఇంట్లో గురువారం అర్థరాత్రి విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. కుటుంబసభ్యులు వెంటనే అప్రమత్తమై ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు.

అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకువచ్చారు.  ఈ ప్రమాదంలో రూ.లక్ష మేర ఆస్తినష్టం వాటిల్లిందని బాధితుడు వెల్లడించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement