సామాజిక తెలంగాణకు ఉద్యమిద్దాం | fight for social telangana | Sakshi
Sakshi News home page

సామాజిక తెలంగాణకు ఉద్యమిద్దాం

Sep 10 2016 11:57 PM | Updated on Sep 4 2017 12:58 PM

సామాజిక తెలంగాణ కోసం చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ఉద్యమించాలని పలువురు కోరారు. నవతెలంగాణ యువజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు బిజిగిరి నవీన్‌కుమార్‌ ఆధ్వర్యంలో శనివారం అమరవీరుల స్థూపం వద్ద చాకలి ఐలమ్మ వర్ధంతి నిర్వహించారు.

కరీంనగర్‌ : సామాజిక తెలంగాణ కోసం చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ఉద్యమించాలని పలువురు కోరారు. నవతెలంగాణ యువజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు బిజిగిరి నవీన్‌కుమార్‌ ఆధ్వర్యంలో శనివారం అమరవీరుల స్థూపం వద్ద చాకలి ఐలమ్మ వర్ధంతి నిర్వహించారు. చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంకుబండ్‌పై ప్రతిష్ఠించాలని కోరారు. బీఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జక్కెనపల్లి గణేష్, వివిధ ప్రజా సంఘాలు, మహిళ సంఘాల నాయకులు చిట్టిమల్ల శ్రీనివాస్, వరాల జ్యోతి, కలర్‌ సత్తెన్న, బొల్లం లింగమూర్తి, పైడిపల్లి రాజు, బిజిగిరి శ్రీనివాస్, కె.మల్లేశం, ప్రశాంత్, రామడుగు రాజేశ్, పూసాల సంపత్‌ తదితరులు పాల్గొన్నారు. 
సీపీయూఎస్‌ఐ ఆధ్వర్యంలో...
ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీ(సీపీయూఎస్‌ఐ)ఆధ్వర్యంలో అంబేద్కర్‌ చౌరస్తాలో చాకలి ఐలమ్మ వర్ధంతి నిర్వహించారు. జిల్లా కో ఆర్డినేటర్‌ సి.రమేశ్, గణేష్, మానేటి రాజు, ఎల్లయ్య, శ్రీనివాస్, భూమయ్య, యాదగిరి, ప్రసాద్, అరుణ్‌కుమార్, వెంకటసాయి, మధు, గోపి, సురేష్, దిలీప్, పెద్దిరాజు, కర్ణ తదితరులు పాల్గొన్నారు. 
గొర్రెల, మేకల పెంపకం వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో 
గొర్రెల, మేకల పెంపకం వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు కడారి అయిలయ్య ఆధ్వర్యంలో ఐలమ్మ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. కటికిరెడ్డి బుచ్చన్న, బీర్ల కనకయ్య, రవీందర్, వట్టె శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, మేకల నర్సయ్య, కాల్వ మల్లేశం, సదానందం తదితరులు పాల్గొన్నారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement