విద్యుత్‌సిబ్బందిని నిర్బంధించిన రైతులు | Farmers detained electric staff | Sakshi
Sakshi News home page

విద్యుత్‌సిబ్బందిని నిర్బంధించిన రైతులు

Oct 16 2016 2:00 PM | Updated on Sep 5 2018 4:03 PM

ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం యాచవరం గ్రామంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

 ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం యాచవరం గ్రామంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గత కొన్ని రోజులుగా విద్యుత్ సరఫరా సరిగ్గా లేకపోవ డంతో.. సబ్‌స్టేషన్ పరిధిలోని నాలుగు గ్రామాలకు చెందిన రైతులు ఈ రోజు సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. విద్యుత్ అధికారులు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో.. ఆగ్రహించిన రైతులు సిబ్బందిని గదిలో వేసి తాళంవేశారు. ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో.. పోలీసులు అక్కడికి చేరుకొని రైతులకు సర్ది చెప్పడానికి యత్నిస్తున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement