
ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం ఆత్మహత్య
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం జగ్గారంలో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది.
పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం జగ్గారంలో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ యజమాని జట్టి సురేష్(30) అనే వ్యక్తి తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని భార్య సరిత(26), ఇద్దరు పిల్లలు నరేందర్(8), నాగచైతన్య(6) మృతదేహాలు మంచంపై పడి ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.