దొంగనోట్ల ముఠా గుట్టురట్టు | fake currency gang busted in nalgonda district | Sakshi
Sakshi News home page

దొంగనోట్ల ముఠా గుట్టురట్టు

Sep 1 2016 11:09 AM | Updated on Sep 4 2017 11:52 AM

నల్లగొండ జిల్లా దామరచర్లలో దొంగనోట్లు చలామణి చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు గురువారం రట్టు చేశారు.

నల్లగొండ: నల్లగొండ జిల్లా దామరచర్లలో దొంగనోట్లు చలామణి చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు గురువారం రట్టు చేశారు. అందుకు సంబంధించి నలుగురు వ్యక్తులకు పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక కిరాణా దుకాణంలో నకిలీ నోట్లు మారుస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని... తమదైన శైలిలో విచారించారు.

దీంతో సదరు నిందితుడు.. ముగ్గురు పేర్లను వెల్లడించాడు. దాంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ ముఠాలోని సభ్యులంతా గుంటూరు జిల్లా జంగులకుంటకు చెందిన వారని పోలీసులు వివరించారు. అలాగే నిందితుల నుంచి 3 లక్షల నకిలీ నోట్లతోపాటు ముద్రణ యంత్రాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement