అల్లుడు గారు.. ఈ పెళ్లి మా అమ్మాయికి ఇష్టం లేదు..! | Tirupati Groom Duped By Family In Marriage Scam, Loses ₹11.38 Lakh And Two iPhones, More Details Inside | Sakshi
Sakshi News home page

అల్లుడు గారు.. ఈ పెళ్లి మా అమ్మాయికి ఇష్టం లేదు..!

May 9 2026 1:27 PM | Updated on May 9 2026 1:46 PM

Marriage Fraud Gang Busted

తిరుపతి జిల్లా: పెళ్లి చేసుకుంటానని ఓ యువకుడిని నమ్మించి...అవసరాల నిమిత్తం అతని రూ.11లక్షల 38వేలు తీసుకుని, తీరా పెళ్లి కోసం నిలదీస్తే ఇష్టం లేదని మోసం చేసిన ఓ కుటుంబంపై బాధితుడు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదైంది.  బాపట్ల జిల్లా గూడపల్లి గ్రామానికి చెందిన సుజేంద్ర(35) ఏర్పేడు మండలం చింతలపాళెం డీఆర్‌డీవో ప్రాంగణంలో ఎస్‌ఎస్‌సీ ప్రాజెక్టు కింద డిప్యూటీ ప్రాజెక్టు మేనేజర్‌.

 సుజేంద్ర పెళ్లి సంబంధాల కోసం ప్రయత్నిస్తుండగా, తొట్టంబేడు మండలం తాటిపర్తికి చెందిన కమలాకర్, తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తానని నమ్మించి అతడి నుంచి పలుమార్లు రూ.11,38,756 నగదును ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా తీసుకున్నారు. అలాగే, రూ.2లక్షలు విలువైన రెండు ఐఫోన్లు కూడా తీసుకున్నారు. మార్చి 6న యువతితో సుజేంద్రకు నిశ్చితార్థం జరిగింది. ఏప్రిల్‌ 22న పెళ్లి జరిగే విధంగా లగ్న పత్రిక రాసుకున్నారు. 

అప్పటినుంచి పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చారు. గట్టిగా నిలదీయడంతో యువతికి పెళ్లి ఇష్టం లేదని చెప్పడంతో తాను ఇచ్చిన నగదు, రెండు ఐఫోన్లు తిరిగి ఇచ్చేయాలని బాధితుడు డిమాండ్‌ చేశారు. నగదు తిరిగి ఇవ్వలేమని వారు ప్లేటు ఫిరాయించారు. తనను ఉద్దేశపూర్వకంగా పెళ్లి పేరుతో నమ్మించి అధిక మొత్తంలో నగదు తీసుకుని పక్కా ప్లాన్‌తో మోసగించారని బాధితుడు ఏర్పేడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో యువతి, ఆమె తల్లిదండ్రులు, సోదరునిపై ఏర్పేడు ఎస్‌ఐ రవికుమార్‌ కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement