బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామంటూ.. | Fake call cheating in Medak | Sakshi
Sakshi News home page

బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామంటూ..

Jun 10 2016 3:11 PM | Updated on Sep 4 2017 2:10 AM

ఎస్‌బీహెచ్ హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నామని.. మీ అకౌంట్‌కు సంబంధించిన వివరాలు ఒక్కసారి కన్‌ఫార్మ్ చేసుకోండని మాయమాటలు చెప్పి అకౌంట్ వివరాలు తీసుకొని అందులోని నగదు అపహరించిన సంఘటన మెదక్ జిల్లాలో శుక్రవారం వెలుగుచూసింది.

మెదక్ : ఎస్‌బీహెచ్ హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నామని.. మీ అకౌంట్‌కు సంబంధించిన వివరాలు ఒక్కసారి కన్‌ఫార్మ్ చేసుకోండని మాయమాటలు చెప్పి అకౌంట్ వివరాలు తీసుకొని అందులోని నగదు అపహరించిన సంఘటన మెదక్ జిల్లాలో శుక్రవారం వెలుగుచూసింది.

శంకరంపేట మండలం కమలాపూర్‌కు చెందిన ఆర్టీసీ డ్రైవర్‌కు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేసి ఎస్‌బీహెచ్ అకౌంట్ వివరాలు తెలుసుకొని అందులో నుంచి రూ.10 వేలు డ్రా చేసుకున్నాడు. అదే ప్రాంతానికి చెందిన సుభాష్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు కూడా ఇదే విధంగా మోసపోయానని, ఎస్‌బీహెచ్ నుంచి మాట్లాడుతున్నామంటే వివరాలు చెప్పానని.. అనంతరం అకౌంట్ చెక్ చేసుకుంటే రూ. 25 వేలు మాయమయ్యాయన్నారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు.

Advertisement
 
Advertisement
Advertisement