కాలం చెల్లిన బిస్కెట్లు | expired biscuits selling | Sakshi
Sakshi News home page

కాలం చెల్లిన బిస్కెట్లు

Aug 6 2016 9:53 PM | Updated on Sep 4 2017 8:09 AM

జోగిపేటలో విక్రయిస్తున్న బిస్కెట్లు

జోగిపేటలో విక్రయిస్తున్న బిస్కెట్లు

కాలం చెల్లిన బిస్కెట్లను విక్రయిస్తుండటంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. పార్లే కంపెనీకి చెందిన హైడ్‌ అండ్‌ సీక్‌ అనే బిస్కట్‌లను పట్టణంలో విక్రయిస్తున్నారు.

జోగిపేట: కాలం చెల్లిన బిస్కెట్లను విక్రయిస్తుండటంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. పార్లే కంపెనీకి చెందిన హైడ్‌ అండ్‌ సీక్‌ అనే బిస్కట్‌ (33 గ్రాములు)లను పట్టణంలో విక్రయిస్తున్నారు. ఈ బిస్కెట్లను జనవరి 20, 2016లో తయారు చేశారు. బిస్కెట్‌ ప్యాకెట్‌పై ఎక్స్‌పైరీ తేదీ ఆరు మాసాలు అని ఉంది. అయినా స్థానిక డీలర్లు యథావిధిగా బిస్కెట్‌ ప్యాకెట్లను పట్టణంలోని కిరాణం, బేకరీ, జనరల్‌ స్టోర్స్‌, మెడికల్‌షాప్‌లకు విక్రయిస్తున్నారు.

దుకాణ యజమానులు కూడా వాటిని చూసుకోకుండానే విక్రయాలు జరుపుతున్నారు. శనివారం మండల అభివృద్ధి కార్యాలయ ఉద్యోగి రామకృష్ణారెడ్డి  బిస్కెట్ల కోసం పట్టణమంతా తిరిగారు. అందరి దగ్గర ఉన్నా కాలం చెల్లిన బిస్కెట్‌లే ఉన్నాయి. దీంతో విషయం వెలుగుచూసింది.

Advertisement
 
Advertisement
Advertisement