ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి
హరిత తెలంగాణే లక్ష్యంగా ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు.
దేవరకొండ : హరిత తెలంగాణే లక్ష్యంగా ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. గురువారం పట్టణంలోని 17వ వార్డు, రిటైర్డ్ ఉద్యోగుల భవనం వద్ద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ, నగర పంచాయతీ చైర్మన్ మంజ్యానాయక్, వైస్ ఎంపీపీ దూదిపాల వేణుధర్‌రెడ్డి, శిరందాసు కష్ణయ్య, వడ్త్య దేవేందర్, చీదెళ్ళ గోపి, బురాన్, వెంకటేశ్వర్‌రావు, టీవీఎన్.రెడ్డి, ఎలిమినేటి సాయి, వస్కుల కాశయ్య, యాదగిరి, వేముల రాజు, బొడ్డుపల్లి కష్ణ తదితరులున్నారు.