ఎర్రపహాడ్‌కు 14న సీఎం కేసీఆర్‌ | errapahad | Sakshi
Sakshi News home page

ఎర్రపహాడ్‌కు 14న సీఎం కేసీఆర్‌

Aug 10 2016 11:37 PM | Updated on Sep 4 2017 8:43 AM

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ నెల 14న జిల్లాకు రానున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తాడ్వాయి మండలం ఎర్రపహాడుకు వస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ నెల 14న జిల్లాకు రానున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తాడ్వాయి మండలం ఎర్రపహాడుకు వస్తున్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవిందర్‌ రెడ్డి తల్లి రాజమ్మ వృతి చెందిన విషయం తెలిసిందే. మాతృవియోగంతో ఉన్న ఎమ్మెల్యే రవీందర్‌ రెడ్డిని పరామర్శించేందుకు సీఎం కేసీఆర్‌ ఆదివారం ఎర్రపహాడ్‌కు రానున్నారని తెలిసింది. హైదరాబాద్‌ నుంచి హెలిక్యాప్టర్‌ ద్వారా ఆయన జిల్లాకు వస్తారు. ఈ నేపథ్యంలో బుధవారం ఎర్రపహాడ్‌ను సందర్శించి రవీందర్‌రెడ్డిని పరామర్శించిన కలెక్టర్‌ డాక్టర్‌ యోగితారాణా.. హెలిప్యాడ్‌ ఏర్పాట్లపై స్థానిక అధికారులతో చర్చించారు. హెలికాప్టర్‌ ద్వారా సీఎం జిల్లాకు రానున్న నేపథ్యంలో ఎర్రపహాడ్‌–మోతె రోడ్డున రవీందర్‌ రెడ్డి వ్యవసాయ క్షేత్రం వద్ద హెలిప్యాడ్‌ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు కామారెడ్డి డీఎస్పీ భాస్కర్‌ బుధవారం స్థల పరిశీలన చేశారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement