వసతుల ఏర్పాట్ల పరిశీలన | Erpatla research facilities | Sakshi
Sakshi News home page

వసతుల ఏర్పాట్ల పరిశీలన

Jul 31 2016 1:09 AM | Updated on Sep 4 2017 7:04 AM

వసతుల ఏర్పాట్ల పరిశీలన

వసతుల ఏర్పాట్ల పరిశీలన

మండలంలోని మహంకాళీగూడెం కష్ణా పుష్కరఘాట్‌ వద్ద యాత్రికులకు కల్పిస్తున్న మౌలిక వసతుల ఏర్పాట్లను శనివారం డీఆర్‌డీఏ పీడీ అంజయ్య పుష్కరఘాట్‌ ఇన్‌చార్జ్‌ సుందరి కిరణ్‌కుమార్‌తో కలిసి పర్యవేక్షించారు.

నేరేడుచర్ల :  మండలంలోని మహంకాళీగూడెం కష్ణా పుష్కరఘాట్‌ వద్ద యాత్రికులకు కల్పిస్తున్న మౌలిక వసతుల ఏర్పాట్లను శనివారం డీఆర్‌డీఏ పీడీ అంజయ్య పుష్కరఘాట్‌ ఇన్‌చార్జ్‌ సుందరి కిరణ్‌కుమార్‌తో కలిసి పర్యవేక్షించారు. ఘాట్‌ వద్ద నిర్మిస్తున్న స్నానాల గదులు, మరుగుదొడ్లు, పార్కింగ్‌ స్థలాలను  పరిశీలించారు. ఏర్పాట్లను త్వరితగతిన ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నేరేడుచర్ల, గరిడేపల్లి తహసీల్దార్లు డి. సత్యనారాయణ, వజ్రాల జయశ్రీ, ఎంపీడీఓ నాగపద్మజ, ఎస్‌ఐ జి. గోపి, ఈఓఆర్‌డీ జ్యోతిలక్ష్మి, పీఆర్‌జేఈ రామకష్ణ, ఐబీఏఈ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement