ఎమ్మెల్యే ఆర్కే రోజాకు సమస్యలను విన్నవిస్తున్న కార్మికుడు మునిరాజ
‘చేనేతకు ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహం అందించడంలేదు. రాత్రింబవళ్లు కష్టపడుతున్నా ఏమీ మిగలడం లేదు. ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోలేక పోతున్నాం.’ అని నగరి మండలం మాంగాడు గ్రామంలో నేత కార్మికులు ప్రభుత్వంపై ఆక్రోశం వ్యక్తం చేశారు.
నగరి:‘చేనేతకు ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహం అందించడంలేదు. రాత్రింబవళ్లు కష్టపడుతున్నా ఏమీ మిగలడం లేదు. ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోలేక పోతున్నాం.’ అని నగరి మండలం మాంగాడు గ్రామంలో నేత కార్మికులు ప్రభుత్వంపై ఆక్రోశం వ్యక్తం చేశారు. గురువారం ఎమ్మెల్యే ఆర్‌కే రోజా గడప గడపకూ వైఎస్‌ఆర్‌లో భాగంగా మాంగాడులో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ఆమె సమస్యలు తెలుసుకున్నారు. చేనేతలకు ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వడం లేదని ఎమ్మెల్యే ఎదుట వాపోయారు.