ఎంసెట్-2 లీకేజీ ప్రభుత్వ వైఫల్యమే | Emcet-2 leakage of government failure | Sakshi
Sakshi News home page

ఎంసెట్-2 లీకేజీ ప్రభుత్వ వైఫల్యమే

Aug 1 2016 2:24 AM | Updated on Sep 4 2017 7:13 AM

ఎంసెట్-2 లీకేజీ ప్రభుత్వ వైఫల్యమే

ఎంసెట్-2 లీకేజీ ప్రభుత్వ వైఫల్యమే

ప్రభుత్వం వైఫల్యంతోనే ఎంసెట్-2 పేపర్ లీకైందని సీఎల్పీ నేత కె.జానారెడ్డి ఆరోపించారు. ఆదివారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో ఆయన మాట్లాడుతూ..

సీఎల్పీ నేత కె.జానారెడ్డి

నాగార్జునసాగర్: ప్రభుత్వం వైఫల్యంతోనే ఎంసెట్-2 పేపర్ లీకైందని సీఎల్పీ నేత కె.జానారెడ్డి ఆరోపించారు. ఆదివారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో ఆయన మాట్లాడుతూ.. ఎంసెట్-2 రద్దు చేయడంతో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందన్నారు.

విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ప్రభుత్వం క్షోభకు గురిచేస్తోందన్నారు.  లీకేజీలో పాత్రధారులు, సూత్రధారులందరినీ కఠినంగా శిక్షించాలని, మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement