సెంట్రల్ జైల్ నుంచి 8 మంది విడుదల | Eight persons released in rajamahendravaram central jail | Sakshi
Sakshi News home page

సెంట్రల్ జైల్ నుంచి 8 మంది విడుదల

Jun 19 2016 11:21 AM | Updated on Sep 26 2018 3:36 PM

సెంట్రల్ జైల్ నుంచి 8 మంది విడుదల - Sakshi

సెంట్రల్ జైల్ నుంచి 8 మంది విడుదల

కాపు ఐక్య గర్జన ఉద్యమంలో భాగంగా తుని సంఘటనకు సంబంధించి పోలీసులు అరెస్టు చేసిన 10 మందిలో 8 మంది శనివారం రాత్రి 7.15 గంటలకు బెయిల్‌పై విడుదలయ్యారు.

రాజమహేంద్రవరం :  కాపు ఐక్య గర్జన ఉద్యమంలో భాగంగా తుని సంఘటనకు సంబంధించి పోలీసులు అరెస్టు చేసిన 10 మందిలో 8 మంది శనివారం రాత్రి 7.15 గంటలకు బెయిల్‌పై విడుదలయ్యారు.  ఈ ఏడాది జనవరి 31న కాపు ఐక్య గర్జన కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా తునిలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ సంఘటనకు బాధ్యులను చేస్తూ 13 మందిని పోలీసులు అరెస్టు చేయగా వారిలో పది మందిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తీసుకువచ్చారు.

వారిలో లగుడు శ్రీనివాస్‌ను సీబీ సీఐడీ రిమాండ్‌కు తీసుకువెళ్ళగా, కూరాకుల పుల్లయ్యకు సంబంధించిన బెయిల్ పేపర్లలో తేడాలు రావడంతో విడుదల చేయలేదు. మిగిలిన 8 మంది గణేషుల రాంబాబు, గణేషుల లక్ష్మణరావు, చక్కపల్లి సత్తిబాబు, పల్లా శ్రీహరిబాబు, దూడల మునీంద్ర, లక్కింశెట్టి గోపీ మహేష్, ముదిగొండ పవన్‌కుమార్, నక్కా సాయిలను విడుదల చేశారు.  వారు రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో దీక్ష చేస్తున్న ముద్రగడను కలిసేందుకు సిద్ధమవగా  పోలీసులు  అడ్డుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement