వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న నిలిచి ఉన్న లారీని ఢీకొట్టిన ఘటనలో 8 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.
8మందికి గాయాలు
వైరా(ఖమ్మం)
వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న నిలిచి ఉన్న లారీని ఢీకొట్టిన ఘటనలో 8 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన ఖమ్మం జిల్లా వైరా సమీపంలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ ఘటనలో బస్సు కండక్టర్ సహా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో.. వారిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.