మైనార్టీలకు ఆర్థిక భరోసా | ECONOMICAL SUPPROT TO MINORETIES | Sakshi
Sakshi News home page

మైనార్టీలకు ఆర్థిక భరోసా

Aug 7 2016 8:47 PM | Updated on Aug 20 2018 3:09 PM

నిడమర్రు: మైనార్టీ కులాలకు చెందిన విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సాంకేతిక, సమాచార ప్రసార మంత్రిత్వశాఖ ద్వారా ‘జాతీయ ఉపకార వేతనం’ పథకం అందుబాటులో ఉంది. అర్హులైన మైనార్టీ విద్యార్థుల నుంచి 2016–17 సంవత్సరానికి ఆన్‌లైన్‌లో కొత్త/ రెన్యూవల్‌ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

నిడమర్రు: మైనార్టీ కులాలకు చెందిన విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సాంకేతిక, సమాచార ప్రసార మంత్రిత్వశాఖ ద్వారా ‘జాతీయ ఉపకార వేతనం’ పథకం అందుబాటులో ఉంది. అర్హులైన మైనార్టీ విద్యార్థుల నుంచి 2016–17 సంవత్సరానికి ఆన్‌లైన్‌లో కొత్త/ రెన్యూవల్‌ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఎంపికైన విద్యార్థులకు ఒకటో తరగతి నుంచి ఇంజినీరింగ్‌ వరకు వత్తి, సాంకేతిక విద్య అభ్యసించేందుకు వివిధ మొత్తాల్లో ఏటా ఉపకార వేతనాలు అందిస్తారు. వీటిని పొందేందకు విద్యార్థులు మైనార్టీ (ముస్లిం, క్రిస్టియన్, సిక్, బుద్దిస్ట్, పర్సీ, జైన్‌) కులాలకు చెందిన వారై ఉండాలి. పథకం వివరాలు మీకోసం. 
ప్రీ మెట్రిక్‌ ఉపకార వేతనం
అర్హులు: 1 నుంచి 10వ తరగతి విద్యార్థులు. 
ప్రోత్సాహం ఏడాదికి: 1 నుంచి 5వ తరగతి వరకు రూ.1,000, 6 నుంచి 10వ తరగతి వరకు రూ.5 వేలు.  
ఆదాయం: తండ్రి/ సంరక్షకుని వార్షిక ఆదాయం రూ.లక్ష లోపు ఉండాలి. 
ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఆగస్టు 31
పోస్ట్‌ మెట్రిక్‌ ఉపకార వేతనం 
అర్హులు: ఇంటర్మీడియెట్‌ తత్సమాన కోర్సులు, అండర్‌ డిగ్రీ కోర్సులు
ప్రోత్సాహం ఏడాదికి: ఇంటర్‌ విద్యార్థికి రూ.7 వేలు, తత్సమాన వత్తి విద్యకు రూ.10 వేలు.
ఆదాయం: తండ్రి/ సంరక్షకుని వార్షిక ఆదాయం రూ.2 లక్షల లోపు ఉండాలి. 
ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఆగస్టు 31
మెరిట్‌ కమ్‌ మీన్స్‌ ఉపకార వేతనాలు
అర్హులు: ఇంటర్‌ తర్వాత వత్తి/సాంకేతిక కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులు (ఇంజినీరింగ్, ఎంబీబీఎస్‌ తదితర కోర్సులు)
ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబర్‌ 31
నగదు ప్రోత్సాహం ఏడాదికి
ప్రోత్సాహం రకం హాస్టల్‌ డేస్కాలర్‌
మెయింటినెన్స్‌ అలవెన్స్‌ రూ.10 వేలు రూ. 5 వేలు
కోర్సు ఫీజు రూ.20 వేలు రూ. 20 వేలు
మొత్తం రూ.30 వేలు రూ. 25 వేలు
కేంద్ర ప్రభుత్వం గుర్తించిన విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు మొత్తం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద చెల్లిస్తారు. 
.......................................
ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఇలా..
అర్హత గల విద్యార్థులు  ఠీఠీఠీ.టఛిజిౌlటటజిజీpట.జౌఠి.జీn వెబ్‌సైట్‌లో అపై ్ల ఫ్రెష్‌ వద్ద కొత్త విద్యార్థులు, అపై ్ల ఫర్‌ రెన్యూవల్‌ వద్ద రెన్యూవల్‌ విద్యార్థులు  దరఖాస్తు చేసుకోవాలి. 
ఆన్‌లైన్‌లో స్కేనింగ్‌ చేసి పొందుపరచాల్సిన ధ్రువీకరణ పత్రాలు
ఆధార్‌ కార్డు, విద్యార్థి సంతకంతో కూడిన ఫొటో, విద్యార్థి సంతకంతో కూడిన కోర్సుకు ముందు గత విద్యా సంవత్సరంలో పొందిన మార్కులు/ పాస్‌ సర్టిఫికెట్‌ ( రెన్యూవల్‌ విద్యార్థులు గతేడాది మార్కుల జాబితా)
–విద్యార్థి ఇచ్చిన సమాచారం పరిశీలించి ధ్రువపరుస్తూ సంబంధిత విద్యా సంస్థ ప్రిన్సిపాల్‌ ఇచ్చే ధ్రువీకరణ పత్రం,  విద్యార్థి సెల్ఫ్‌ డిక్లరేషన్‌తో కూడిన ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు, సెల్ఫ్‌ డిక్లరేషన్‌తో కూడిన కులధ్రువీకరణ పత్రం, విద్యాసంస్థకు ట్యూషన్‌/ కోర్సు ఫీజు, హాస్టల్‌ ఫీజు చెల్లించిన రశీదులు., ఏదైనా జాతీయ బ్యాంక్‌ పాస్‌బుక్‌ మొదటి పేజీ (స్కానింగ్‌లో ఫొటో, అడ్రస్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ తప్పని సరిగా ఉండేలా జాగ్రత్త పడాలి)
–10వ తరగతి తర్వాత విద్యార్థులు ఈ ఉపకార వేతనాలకు అర్హత సాధించాలంటే వారు తప్పనిసరిగా సంబంధిత కోర్సులో గత విద్యా సంవత్సరంలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. 
–ఒక కోర్సులో అడ్మిషన్‌ పొందిన తర్వాత కోర్సు మార్చుకుంటే వారు అనర్హులు, సమాచారం తప్పని నిర్దారణ అయితే లబ్ధి పొందిన మొత్తాన్ని విద్యార్థి నుంచి వసూలు చేయడంతో పాటు భవిష్యత్‌లో ఏ ఇతర ఉపకార వేతనం పొందేందుకు వీలు లేకుండా అనర్హుల జాబితాలో చేర్చుతారు. 
 
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement