ఎం‘తాటి’ కరువో..! | drought heavy | Sakshi
Sakshi News home page

ఎం‘తాటి’ కరువో..!

Apr 22 2017 11:56 PM | Updated on Sep 5 2017 9:26 AM

ఎం‘తాటి’ కరువో..!

ఎం‘తాటి’ కరువో..!

ఎంత కరువు వచ్చినా.. నీరు లేకపోయినా తాటి, ఈత, టెంకాయ చెట్లు పచ్చగానే ఉంటాయి. ఎంతటి వర్షాభావాన్ని అయినా తట్టుకుంటాయి.

ఎంత కరువు వచ్చినా.. నీరు లేకపోయినా తాటి, ఈత, టెంకాయ చెట్లు పచ్చగానే ఉంటాయి. ఎంతటి వర్షాభావాన్ని అయినా తట్టుకుంటాయి.  కానీ ఈసారి పోట్లమర్రి , వేల్పుమడుగు, ముష్టూరు, రాఘవంపల్లి, లింగారెడ్డిపల్లి గ్రామాల సమీపంలో ఉన్న వందలాది తాటిచెట్లు ఎండుముఖం పట్టాయి. సుమారు పదేళ్లుగా వర్షాలు సక్రమంగా కురవలేదు. వాగులు పారలేదు. దీంతో భూగర్భజలాలు అడుగంటాయి. ఫలితంగా తాటి చెట్లు ఎండిపోతున్నాయి. ఏటా వేసవిలో తాటిముంజెలు విరివిగా ఉండేవి. కానీ ఈ ఏడాది తాటిముంజెల విక్రయాలు ఎక్కువగా కనిపించలేదు. వాటిని అమ్ముకొని జీవించే అనేక కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.  
- బత్తలపల్లి

Advertisement
 
Advertisement
Advertisement