లారీ ఢీకొని డీఆర్‌డీఏ ఏసీవో దుర్మరణం | drdo aco died in lorry accident | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని డీఆర్‌డీఏ ఏసీవో దుర్మరణం

Sep 17 2016 11:42 PM | Updated on Sep 28 2018 3:41 PM

సంఘటన స్థలంలో మృతి చెందిన రమేష్‌ - Sakshi

సంఘటన స్థలంలో మృతి చెందిన రమేష్‌

కురబలకోట మండలంలో శనివారం ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో తంబళ్లపల్లె నియోజకవర్గ డీఆర్‌డీఏ రమేష్‌(47) దుర్మరణం చెందారు. ఏపీఎం సాంబశివ తీవ్రంగా గాయపడ్డారు.

– ఏపీఎంకు తీవ్రగాయాలు
మదనపల్లె టౌన్‌: కురబలకోట మండలంలో శనివారం ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో తంబళ్లపల్లె నియోజకవర్గ డీఆర్‌డీఏ రమేష్‌(47) దుర్మరణం చెందారు. ఏపీఎం సాంబశివ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు... అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన తోట రామచంద్రయ్య కుమారుడు రమేష్‌(47) మదనపల్లెకు చెందిన మాధవిని 17 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. అమ్మినేని వీధిలో నివాసం ఉంటూ తంబళ్లపల్లె నియోజకవర్గ వెలుగు, డీఆర్‌డీఏ కార్యాలయంలో పనిచేస్తున్నారు. పట్టణంలోని దిగువకమ్మపల్లెలో నివాసముంటున్న ఏపీఎం శివ (35) కలిసి శనివారం ఉదయం విధుల నిమిత్తం తంబళ్లపల్లె వెళ్లారు. తిరిగి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంలో వస్తుండగా కురబలకోట మండలం కంటేవారిపల్లె సమీపంలో లారీ ఢీకొంది. ఈ ఘటనలో రమేష్‌ అక్కడికక్కడే దుర్మరణం చెందగా శివకు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని స్థానికులు 108లో మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు రమేష్‌కు భార్య మాధవి, పిల్లలు మానస, మౌనిషా ఉన్నారు. మాధవి మదనపల్లె ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కార్యాలయంలో ఏపీఎంగా పనిచేస్తున్నారు. రమేష్‌ కుటుంబాన్ని ఎమ్మెల్యే డాక్టర్‌ దేశాయ్‌తిప్పారెడ్డి పరామర్శించి సంతాపం తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement