ధర్మపురి : ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహాస్వామి ఆలయం వెనుక స్థలం కొనుగోలు చేయడానికి ఎల్లాల శ్రీనాథ్‌రెడ్డి, కవిత దంపతులు రూ.లక్ష విరాళం ప్రకటించారు.
ఆలయ స్థలం కొనుగోలుకు రూ.లక్ష విరాళం
Aug 9 2016 12:03 AM | Updated on Sep 4 2017 8:25 AM
ధర్మపురి : ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహాస్వామి ఆలయం వెనుక స్థలం కొనుగోలు చేయడానికి ఎల్లాల శ్రీనాథ్‌రెడ్డి, కవిత దంపతులు రూ.లక్ష విరాళం ప్రకటించారు. పట్టణానికి చెందిన రిటైర్డు సివిల్ సర్జన్ ఎల్లాల రాజరెడ్డి, రమాదేవి కుమారుడు ఎల్లాల శ్రీనాథ్‌రెడ్డి అమెరికాలో స్థిరపడ్డారు. నృసింహుని ఆలయం వెనుకభాగంలోని ఖాళీ స్థలాన్ని కొనుగోలుకు ఆలయ అధికారులు నిర్ణయించగా.. శ్రీనాథ్‌రెడ్డి దంపతులు మాజీ జెడ్పీటీసీ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి ద్వారా రూ.లక్షను ఆలయ వో సుప్రియకు అందించారు.
Advertisement


