జిల్లాలో 4.5కోట్ల మొక్కలు నాటడం లక్ష్యం | distirc target 4.5croes plantation | Sakshi
Sakshi News home page

జిల్లాలో 4.5కోట్ల మొక్కలు నాటడం లక్ష్యం

Aug 16 2016 6:17 PM | Updated on Sep 18 2018 6:30 PM

జిల్లాలో నాలుగున్నర కోట్ల మొక్కలు నాటేందుకు ప్రభుత్వం ఏర్పాట్లుచేసిందని టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి అన్నారు. కాల్వశ్రీరాంపూర్‌ మండలం గంగారంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే జిల్లాలో 3.70 కోట్లు నాటినట్లు చెప్పారు.

  •  టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి కాల్వశ్రీరాంపూర్‌: జిల్లాలో నాలుగున్నర కోట్ల మొక్కలు నాటేందుకు ప్రభుత్వం ఏర్పాట్లుచేసిందని టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి అన్నారు. కాల్వశ్రీరాంపూర్‌ మండలం గంగారంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే జిల్లాలో 3.70 కోట్లు నాటినట్లు చెప్పారు. వాతావరణ కాలుష్యాన్ని తొలగించి, మానవ మనుగడకు సహకరించే అడవులతో వర్షాలు కురిసి కరువుకాటకాలు దూరమవుతాయన్నారు. రోడ్లకిరువైలా మెుక్కలు నాటేందుకు ఆర్‌అండ్‌బీ అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో జెడ్పీటీసీ లంక సదయ్య, వైస్‌ ఎంపీపీ కొంకటి మల్లారెడ్డి, సర్పంచులు సత్యనారాయణ రెడ్డి, సతీష్, ఉప సర్పంచు పెంతల మల్లయ్య, పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement