16 నుంచి దూరవిద్య పరీక్షలు | distance degree exams from 16 | Sakshi
Sakshi News home page

16 నుంచి దూరవిద్య పరీక్షలు

Dec 31 2016 12:34 AM | Updated on Nov 6 2018 5:13 PM

ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం దూరవిద్య కోర్సులకు సంబంధించి డిగ్రీ, పీజీ పరీక్షలు జనవరి 16 నుంచి ప్రారంభం కానున్నాయి.

ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం దూరవిద్య కోర్సులకు సంబంధించి డిగ్రీ, పీజీ పరీక్షలు జనవరి 16 నుంచి ప్రారంభం కానున్నాయి. 2013 – 14, 2014 – 15 విద్యాసంవత్సరంలో ప్రవేశాలు పొందిన బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఎం కోర్సులకు సంబంధించి రెండు, మూడు సంవత్సరాలకు, ఏంఏ, ఎం.కామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు రెండో సంవత్సరానికి, లేటరల్‌ ఎంట్రీ విధానం ద్వారా ప్రవేశాలు పొందిన వారికి జనవరి 16 నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు. డిగ్రీ పరీక్షలు జనవరి 27న, పీజీ పరీక్షలు జనవరి 23న ముగియనున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement