డిజిటల్‌ తరగతుల ప్రారంభం వాయిదా | digital classes starts post poned | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ తరగతుల ప్రారంభం వాయిదా

Oct 14 2016 11:01 PM | Updated on Sep 4 2017 5:12 PM

రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో శనివారం అధికారికంగా ప్రారంభం కావాల్సిన డిజిటల్‌ తరగతులు వాయిదా పడ్డాయి.

అనంతపురం ఎడ్యుకేషన్‌ : రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో శనివారం అధికారికంగా ప్రారంభం కావాల్సిన డిజిటల్‌ తరగతులు వాయిదా పడ్డాయి. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులకు సమాచారం అందింది. ఈ నెల 20న ప్రారంభమవుతాయని ఇక్కడి అధికారులు చెబుతున్నారు.

జిల్లాలో ఇప్పటికి 18 పాఠశాలల్లో డిజిటల్‌  తరగతులు ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే వాయిదా పడటంతో అరకొర సదుపాయాలున్న 80 మోడల్‌ ప్రైమరీ పాఠశాలల్లోనూ వసతులు కల్పించి ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement