డీఎడ్‌ ప్రాక్టికల్స్‌ వాయిదా | diet practical exams postponed | Sakshi
Sakshi News home page

డీఎడ్‌ ప్రాక్టికల్స్‌ వాయిదా

Jul 28 2017 10:15 PM | Updated on Sep 26 2018 3:25 PM

డైట్, డీఎడ్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఈనెల 31 నుంచి ఆగస్టు 5 వరకు, రెండో విడత ఆగస్టు 7 నుంచి 12 వరకు నిర్వహించాల్సిన ప్రాక్టికల్‌ పరీక్షలు వాయిదా పడినట్లు డైట్‌ ప్రిన్సిపల్‌ జనార్దన్‌రెడ్డి శుక్రవారం తెలిపారు.

బుక్కపట్నం:  డైట్, డీఎడ్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఈనెల 31 నుంచి ఆగస్టు 5 వరకు, రెండో విడత ఆగస్టు 7 నుంచి 12 వరకు నిర్వహించాల్సిన ప్రాక్టికల్‌ పరీక్షలు వాయిదా పడినట్లు డైట్‌ ప్రిన్సిపల్‌ జనార్దన్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. ఆయన డైట్‌లో పరీక్షల నిర్వహణపై జిల్లాలో ఉన్న  ప్రయివేట్‌ డీఎడ్‌ కళాశాల ప్రిన్సిపాళ్లతో ప్రాక్టికల్స్‌ పరీక్షలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమావేశం నిర్వహించారు.  సమావేశం ముగిసే లోగానే పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు  ఉన్నాతాధికారుల నుంచి సమాచారం వచ్చిందని, తదుపరి తేదీ ప్రకటించాల్సి ఉందని ప్రిన్సిపల్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement