భక్తిమార్గమే మిన్న | devotional way precious | Sakshi
Sakshi News home page

భక్తిమార్గమే మిన్న

Aug 2 2016 9:12 PM | Updated on Sep 4 2017 7:30 AM

ప్రవచిస్తున్న చెన్న బసవరాజ్‌ స్వామి

ప్రవచిస్తున్న చెన్న బసవరాజ్‌ స్వామి

అనేక మార్గాలున్నా భక్తి మార్గమే గొప్పదని కర్నాటకకు చెందిన ప్రముఖ వక్త చెన్న బసవరాజ్‌ స్వామి అన్నారు.

జహీరాబాద్‌ టౌన్‌: అనేక మార్గాలున్నా భక్తి మార్గమే గొప్పదని కర్నాటకకు చెందిన ప్రముఖ వక్త చెన్న బసవరాజ్‌ స్వామి అన్నారు. జహీరాబాద్‌ దత్తగిరి కాలనీలోని బసవమంటపంలో మంగళవారం రాత్రి రాష్ర్టీయ బసవదళ్‌ ఆధ్వర్యంలో శ్రావణ మాస ప్రవచన కార్యక్రమం నిర్వహించారు. నెల పాటు కొనసాగే ఈ కార్యక్రమంలో  చెన్న బసవరాజ్‌ స్వామి మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరిపై విశ్వాసం కలిగి ఉండాలన్నారు.

ముఖ్యంగా భార్య భర్తల మధ్య విశ్వాసం అధికంగా ఉండాలని, అప్పుడే జీవితం సుఖంగా సాగుతుందన్నారు.  కార్యక్రమంలో జహీరాబాద్‌ టౌన్‌ సీఐ. నాగరాజ్‌, రాష్ర్టీయ బసదళ్‌ అధ్యక్షుడు శంకర్‌పాటిల్‌, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. అనంతరం బసవమంటపంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని సీఐ.నాగరాజ్‌ ప్రారంభించి బసవేశ్వరుడి పుస్తకాలను కొనుగోలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement