వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో.. కృష్ణా పుష్కరాల్లో పవిత్ర స్నానమాచారించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
సాగర్ ఘాట్‌లో భక్తుల ఇక్కట్లు
Aug 13 2016 3:31 PM | Updated on Oct 19 2018 7:19 PM
నాగార్జున సాగర్: వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో.. కృష్ణా పుష్కరాల్లో పవిత్ర స్నానమాచారించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయక పోవడంతో భక్తులతో పాటు బ్రాహ్మణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాగార్జున సాగర్ శివాలయం ఘాట్ వద్ద ప్రస్తుతం భక్తుల రద్దీ అధికంగా ఉంది. వేలాది మంది భక్తులు పిండ ప్రధానం కార్యక్రమం చేపట్టడానికి యత్నిస్తుండగా.. వసతుల లేమి వెక్కిరిస్తోంది. ఈ రోజు భానుడి భగభగలు ఎక్కువగా ఉండటంతో.. ఎండలోనే పిండ ప్రధానం చేస్తున్న పలువురు భక్తులు సొమ్మసిల్లారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Advertisement