'నాకు ఒక్క గజం స్థలం కూడా లేదు' | devineni uma lived in rented house in gollapudi | Sakshi
Sakshi News home page

'నాకు ఒక్క గజం స్థలం కూడా లేదు'

Jul 12 2016 7:44 PM | Updated on Mar 23 2019 8:59 PM

నాకు ఒక్క గజం స్థలం కూడా లేదని విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో అద్దె ఇంట్లో నివసిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు.

విజయవాడ : నాకు ఒక్క గజం స్థలం కూడా లేదని విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో అద్దె ఇంట్లో నివసిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి   దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. మంగళవారం గొల్లపూడిలో ప్రజాసాధికారిక సర్వే కార్యక్రమాన్ని అధికారులు మంత్రి ఉమా ఇంటి నుంచి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఉమా... ఆధార్‌కార్డు, ఓటరుకార్డు వివరాలను మాత్రమే అధికారులకు అందచేశారు. ఆస్తులకు సంబంధించిన వివరాలను మంత్రి దేవినేని ఉమ వెల్లడించలేదు. ఎంపీడీఓ బ్రహ్మయ్య, ఎన్యూమరేటర్ నిర్మలకుమారి వివరాలను సేకరించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement