నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా: శశిధర్‌ రెడ్డి | development effort for constitution: shashidhar reddy | Sakshi
Sakshi News home page

నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా: శశిధర్‌ రెడ్డి

Jul 21 2016 6:05 PM | Updated on Sep 4 2017 5:41 AM

నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా: శశిధర్‌ రెడ్డి

నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా: శశిధర్‌ రెడ్డి

నియోజకవర్గ పరిధిలోని గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని టీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి అన్నారు.

 తమ్మరబండపాలెం(కోదాడరూరల్‌): నియోజకవర్గ పరిధిలోని గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని టీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని బండపాలెంలో రూ. 4 లక్షలతో మంత్రి నిధుల నుంచి∙చేపట్టిన సీసీరోడ్డు పనులకు శంకుస్థాపన చేసి ఆయన మాట్లాడారు. ఇప్పటికే మంత్రి నిధులతో పలు గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ డేగరాణి, సర్పంచ్‌ సుల్తానీ కాటయ్య, ఎంపీటీసీలు రమేష్, పిచ్చమ్మ, పీఆర్‌ఏఈ లక్ష్మారెడ్డి, కమతం వెంకటయ్య, ఎస్‌కె.మీరా, కరుణాకర్, గడిపూడి శ్రీకాంత్, నెల్లూరి వీరభద్రరావు,   ఈదుల కృష్ణయ్య, వెంకటయ్య, డేగ కొండయ్య, నాగుల్‌మీరా, కనకయ్య, సైదులు, కార్యదర్శి జానిమియా తదితరులు పాల్గొన్నారు.


 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement