రిమ్మనగూడకు మంత్రి వరాలు | developed works in rimmanaguda | Sakshi
Sakshi News home page

రిమ్మనగూడకు మంత్రి వరాలు

Sep 6 2016 7:21 PM | Updated on Sep 4 2017 12:26 PM

గజ్వేల్‌ మండలం రిమ్మనగూడ గ్రామానికి మంత్రి హరీశ్‌రావు వరాలు కురిపించారు.

గజ్వేల్‌: గజ్వేల్‌ మండలం రిమ్మనగూడ గ్రామానికి మంత్రి హరీశ్‌రావు వరాలు కురిపించారు. సోమవారం వినాయక చవితి సందర్భంగా గ్రామంలో పర్యటించి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన సందర్భంలో గ్రామసర్పంచ్‌ పోచి చిన్నరాములు, గ్రామస్తులు చేసిన విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించారు.

ప్రధానంగా గ్రామానికి రూ. 10లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్‌, రూ. 10లక్షలతో బీసీ కమ్యూనిటీ హాల్‌, ఈద్గా నిర్మాణం కోసం రూ. 2లక్షలు, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో రెండు అదనపు గదుల నిర్మాణానికి నిధులు, లైబ్రరీ, యూత్‌ బిల్డింగ్‌ కోసం రూ. 10లక్షలు, రిమ్మనగూడ-కోనాపూర్‌ బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

నిధులు విడుదల చేస్తామని ప్రకటించగానే గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. అదే విధంగా కొడకండ్ల గ్రామంలోనూ పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement