వరంగల్ జిల్లా హసన్‌పర్తి మండలం ఎర్రగట్టు సమీపంలో బుధవారం రెండు చోట్ల దేవాదుల పైప్‌లైన్ పగిలింది.
హసన్‌పర్తి: వరంగల్ జిల్లా హసన్‌పర్తి మండలం ఎర్రగట్టు సమీపంలో బుధవారం రెండు చోట్ల దేవాదుల పైప్‌లైన్ పగిలింది. పైప్ నుంచి నీరు సుమారు 50 మీటర్ల ఎత్తు వరకు నీరు ఎగసిపడుతోంది. సుమారు మూడు గంటల సేపు నీరు వృథాగా పోయింది. లీకేజీతో చుట్టుపక్కల పొలాలన్నీ జలమయం అయ్యాయి. జిల్లా భారీ నీటిపారుదల శాఖ కార్యాలయానికి కూత వేటు దూరంలోనే ఈ లీకేజీ అయింది. మధ్యాహ్నానికి అధికారులు వచ్చి మరమ్మత్తుల చేపట్టారు.