సాక్షరభారత్‌ డిప్యూటీ డైరెక్టర్‌ స్వచ్ఛంద పదవీ విరమణ | deputy director of Saksarabharat voluntary retirement | Sakshi
Sakshi News home page

సాక్షరభారత్‌ డిప్యూటీ డైరెక్టర్‌ స్వచ్ఛంద పదవీ విరమణ

Nov 1 2016 12:03 AM | Updated on Jun 1 2018 8:39 PM

సాక్షరభారత్‌  డిప్యూటీ డైరెక్టర్‌ స్వచ్ఛంద పదవీ విరమణ - Sakshi

సాక్షరభారత్‌ డిప్యూటీ డైరెక్టర్‌ స్వచ్ఛంద పదవీ విరమణ

సాక్షరభారత్‌ మిషన్‌ (వయోజన విద్య) ఉప సంచాలకులు భోజరాజు స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. ఈయనకు ఇంకా 20 నెలల సర్వీస్‌ ఉంది. అయినా స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేయడం చర్చనీయాంశమైంది.

 

  •  సిబ్బంది వ్యవహారమే కారణం?

అనంతపురం ఎడ్యుకేషన్‌ : సాక్షరభారత్‌ మిషన్‌ (వయోజన విద్య) ఉప సంచాలకులు భోజరాజు స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. ఈయనకు ఇంకా 20 నెలల సర్వీస్‌ ఉంది. అయినా స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేయడం చర్చనీయాంశమైంది. స్వచ్ఛందవిరమణకు అనుమతి ఇవ్వాలని గతంలో దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలు జిల్లాకు చెందిన భోజరాజు ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ (పీఓ)గా జిల్లాకు వచ్చారు.

గతంలో డీడీగా పని చేస్తున్న  ఈశ్వరయ్య ఆత్మహత్య చేసుకున్న తర్వాత డీడీ ఎఫ్‌ఏసీగా ఆయనకే బాధ్యతలు ఇచ్చారు. 2015 డిసెంబరులో  డీడీగా రెగ్యులర్‌ అయింది. అప్పటి నుంచే ఆయనే కొనసాగుతున్నారు. వాలంటరీ రిటైర్‌మెంట్‌ ఇవ్వడంతో పీఓగా పని చేస్తున్న సలీంకు ఎఫ్‌ఏసీగా బాధ్యతలు అప్పగించారు.  ఇదిలాఉండగా వ్యక్తిగత పరిస్థితుల కారణంగానే స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నట్లు భోజరాజు చెబుతున్నా...అంతర్గతంగా మాత్రం తాను పని చేస్తున్న చోట పడుతున్న ఇబ్బందులు తాళలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 

 సిబ్బందిలో మార్పు రాకపోవడం... తనకు ఎక్కడ చెడ్డపేరు వస్తుందోనన్న భయంతో   ఈనిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.  దీనిపై మాట్లాడేందుకు ‘సాక్షి’ ఫోన్‌ చేయగా...‘నేను నిజాయితీ కుటుంబం నుంచి వచ్చాను. ఉద్యోగ విరమణ చేయడం ద్వారా నాకు ఎలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవు. కుటుంబంతో ప్రశాంతంగా జీవిస్తాను. ఇంతకు మించి నన్నేమి అడగవద్దు’ అని సమాధానమిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement