రిజిస్ట్రేషన్ శాఖకు షాక్
నెల్లూరు(సెంట్రల్): ప్రభుత్వానికి అధిక ఆదాయం తెచ్చే రిజిస్ట్రేషన్ శాఖకు పెద్ద నోట్ల రద్దుతో పెద్ద షాక్ తగిలింది. ఎప్పుడూ లేనంతగా సగానికిపైగా రిజిస్ట్రేషన్లు పడిపోయాయి.
-
టార్గెట్ తమ వల్ల కాదంటున్న సబ్‌రిజిస్ట్రార్లు
-
సగానికి పడిపోయిన రిజిస్ట్రేషన్లు
నెల్లూరు(సెంట్రల్): ప్రభుత్వానికి అధిక ఆదాయం తెచ్చే రిజిస్ట్రేషన్ శాఖకు పెద్ద నోట్ల రద్దుతో పెద్ద షాక్ తగిలింది. ఎప్పుడూ లేనంతగా సగానికిపైగా రిజిస్ట్రేషన్లు పడిపోయాయి. దీంతో నిత్యం కళకళలాడే సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. నెల వారీగా విధించే టార్గెట్‌ను చేయడం తమ వల్ల కాదంటూ సబ్‌రిజిస్ట్రార్లు చేతులెత్తేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రధానంగా రిజిస్ట్రేషన్ శాఖకు తగిలిన షాక్ నుంచి ఇప్పట్లో కోలుకునేలా లేదని పలువురు అధికారులు చెప్పడం గమనార్హం.
కుదేలైన రిజిస్ట్రేషన్లు
నెల్లూరు జిల్లాలో తొమ్మిది సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు, గూడూరు జిల్లాలో 10 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో ఈ నెల 8వ తేదీకి ముందు 15 రోజులు పరిశిలిస్తే దాదాపుగా రెండు వేల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ జరిగేవని అధికారులు పేర్కొంటున్నారు. కాగా ఈ నెల 8వ తేదీ నుంచి 24వ తేదీ వరకు 900 డాక్యుమెంట్లు అయినట్లు అధికారులు పేర్కొంటున్నారు. రెవెన్యూపరంగా చూస్తే 8వ తేదీకు ముందు 15 రోజుల కిత్రం దాదాపుగా రూ.12 కోట్లు వివిధ రూపాల్లో రిజిస్ట్రేషన్ శాఖకు వచ్చేదని, నోట్ల రద్దు నుంచి 24వ తేదీ వరకు రూ.6.28 కోట్లు మాత్రమే వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఓ పక్క రియల్‌ఎస్టేట్ వ్యాపారం అంతంతమాత్రంగా ఉండి ఇప్పుడే కొంత ఊపందుకుంటున్న తరుణంలో పెద్ద నోట్ల రద్దుతో వ్యాపారం కూడా భారీగా పడిపోయినట్లు పలువురు పేర్కొన్నారు.
సబ్‌రిజిస్ట్రార్ల ఆందోళన
ప్రతి సబ్‌రిజిస్ట్రార్‌కు ఇచ్చిన టార్గెట్ ప్రకారం నెల నెలా రిజిస్ట్రేషన్లు చేయాలని సంబంధిత శాఖ ఉన్నతాధికారుల నంచి ఆదేశాలు ఉన్నాయి. కాగా పెద్ద నోట్ల రద్దు నుంచి సగానికిపైగా పడిపోవడంతో టార్గెట్ పూర్తి చేయడం తమ వల్ల కాదని చేతులేత్తుస్తున్నారు. కార్పొరేషన్, మున్సిపాల్టీల్లో కాకుండా మండల ప్రాంతాల్లోని సబ్‌రిజిస్ట్రార్ల పరిస్థితి మరీ దారుణంగా ఉందని పలువురు అధికారులు పేర్కొనడం గమనార్హం.
ఆదాయానికి గండి: అబ్రహాం, జిల్లా రిజిస్ట్రార్
పెద్దనోట్ల రద్దు తర్వాత రిజిస్ట్రేషన్‌కు వచ్చే వారు చాలా తగ్గిపోయారు. రిజిస్ట్రేషన్ ద్వారా ప్రభుత్వాదాయానికి భారీగానే గండిపడింది. ఇప్పట్లో రిజిస్ట్రేషన్ శాఖ కోలుకునే పరిస్థితి లేదు. జిల్లాలోని పరిస్థితిని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నాం.