డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య | degree student suicide | Sakshi
Sakshi News home page

డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

Oct 6 2016 12:34 AM | Updated on Nov 6 2018 7:56 PM

విజయనగర్‌ కాలనీకు చెందిన ఓ డిగ్రీ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం చోటు చేసుకుంది.

బుక్కరాయసముద్రం : విజయనగర్‌ కాలనీకు చెందిన ఓ డిగ్రీ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలమేరకు అనంతపురం నగర సమీపంలో ఉన్న విజయనగర కాలనీలో నివాసం ఉంటున్న జయరాములు పార్వతమ్మల కుమార్తె మనీషా(19) నగరంలోని ఎస్‌ఎస్‌బీఎన్‌ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.
 
ఇటీవల వెలువడిన పరీక్షల ఫలితాల్లో రెండు సబ్జెక్టులలో ఫెయిల్‌ అయింది. దీంతో మనస్థాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
 
చెన్నంపల్లిలో వృద్ధురాలు..
బుక్కరాయసముద్రం : మండల పరిధిలోని చెన్నంపల్లిలో ఓ వృద్ధురాలు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు చెన్నంపల్లిలో జయమ్మ (70) అనారోగ్యంతో బాధపడుతూ ఉండేది. జీవితంపై విరక్తి చెంది కొడుకు, కోడలు ఇంట్లో లేని సమయంలో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement