డిగ్రీ విద్యార్థిని ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన కరీంనగర్ జిల్లా రామగుండం మండలం పాలకుర్తి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది.
రామగుండం (కరీంనగర్) : డిగ్రీ విద్యార్థిని ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన కరీంనగర్ జిల్లా రామగుండం మండలం పాలకుర్తి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎస్.స్రవంతి(18) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది.
శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. యువతి రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో ఉన్న అంశాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.