అంబేడ్కర్‌ వర్సిటీ అడ్మిషన్ల గడువు 8 వరకు పెంపు | dead line extended for ambetkar open university admitions | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌ వర్సిటీ అడ్మిషన్ల గడువు 8 వరకు పెంపు

Aug 20 2016 11:37 PM | Updated on Aug 17 2018 3:09 PM

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని, డిగ్రీ కోర్సుకు గతంలో ఈ నెల 20ని చివరితేదీగా ప్రకటించగా విద్యార్థుల సౌకర్యార్థం ఈ గడువును సెప్టెంబర్‌ 8 వరకూ పొడిగించామని యూనివర్సిటీ విద్యార్థి సేవా విభాగం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఎల్‌.విజయ కృష్ణారెడ్డి తెలిపారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌ పేట) : డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని, డిగ్రీ కోర్సుకు గతంలో ఈ నెల 20ని చివరితేదీగా ప్రకటించగా విద్యార్థుల సౌకర్యార్థం ఈ గడువును సెప్టెంబర్‌ 8 వరకూ పొడిగించామని యూనివర్సిటీ విద్యార్థి సేవా విభాగం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఎల్‌.విజయ కృష్ణారెడ్డి తెలిపారు. శనివారం స్థానిక సీఆర్‌ రెడ్డి డిగ్రీ కళాశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిగ్రీలో చేరేందుకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుందని, రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న విద్యార్థులు దరఖాస్తు ప్రింటు తీసుకుని ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, జిరాక్స్‌ కాపీలతో ఎంపిక చేసుకున్న అధ్యయన కేంద్రాలకు వెళ్లి పరిశీలన చేయించుకోవాలని సూచించారు. పీజీ, డిప్లొమా కోర్సులకు కూడా తమ యూనివర్సిటీ నోటిఫికేషన్‌ జారీ చేసిందని చెప్పారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement