తల్లి హత్యకేసులో కొడుకు, కోడలు అరెస్ట్ | daughter and son in law arrested in guntur district | Sakshi
Sakshi News home page

తల్లి హత్యకేసులో కొడుకు, కోడలు అరెస్ట్

May 26 2016 11:43 PM | Updated on Jul 30 2018 8:29 PM

తల్లి హత్యకేసులో కొడుకు, కోడలు అరెస్ట్ - Sakshi

తల్లి హత్యకేసులో కొడుకు, కోడలు అరెస్ట్

వినుకొండ పట్టణంలోని సీతారామ అపార్ట్‌మెంట్‌లో ఈ నెల 23వ తేదీన మాకినేని సత్యశ్రీ(56) అనే మహిళ హత్య కేసులో ఆమె కొడుకు సందీప్, కోడలు శ్రావణ్యను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.

గుంటూరు : వినుకొండ పట్టణంలోని సీతారామ అపార్ట్‌మెంట్‌లో ఈ నెల 23వ తేదీన మాకినేని సత్యశ్రీ(56) అనే మహిళ హత్య కేసులో ఆమె కొడుకు సందీప్, కోడలు శ్రావణ్యను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. సందీప్ జల్సాలకు అలవాటు పడి సుమారు రూ. కోటి అప్పు చేశాడు. కొడుకు, కోడల్ని తల్లి మాకినేని సత్యశ్రీనే పెళ్లైన దగ్గరి నుంచి పోషిస్తోంది. మరో రెండు రోజుల్లో సత్యశ్రీ అమెరికాలో ఉన్న తన కుమార్తె వద్దకు వెళ్లబోతోంది.

ఈ విషయం తెలిసిన సందీప్..తల్లి కూతురి దగ్గరికి వెళితే తన అప్పు తీర్చడం కష్టమవుతుందని సందీప్, శ్రావణ్య భావించారు. ఆ క్రమంలో ఇద్దరూ కలిసి సత్యశ్రీ పీక నొక్కి చంపేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా సందీప్, శ్రావణ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్ని ప్రశ్నించారు. ఇద్దరూ కలిసే సత్యశ్రీని హత్య చేశారని పోలీసుల ప్రాధమిక విచారణలో తేల్చారు. వారిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి వినుకొండ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం వారిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement