సార్వత్రిక విద్యా పీఠం(ఓపెన్ స్కూల్) ద్వారా 2016–17 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి, ఇంటర్మీడియెట్ ప్రవేశాలకు అపరాధ రుసుంతో ఫీజు చెల్లించడానికి ఈనెల 31 వరకు గడువు పొడిగించారు. అడ్మిషన్ ఫీజుతోపాటు పదో తరగతికి రూ.100, ఇంటర్‌కు రూ.200 అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుందని డీఈఓ అంజయ్య, ఓపెన్ స్కూల్ కో–ఆర్డినేటర్ గంధం శ్రీనివాసులు ఓ ప్రకటనలో తెలిపారు.
అనంతపురం ఎడ్యుకేషన్ : సార్వత్రిక విద్యా పీఠం(ఓపెన్ స్కూల్) ద్వారా 2016–17 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి, ఇంటర్మీడియెట్ ప్రవేశాలకు అపరాధ రుసుంతో ఫీజు చెల్లించడానికి ఈనెల 31 వరకు గడువు పొడిగించారు. అడ్మిషన్ ఫీజుతోపాటు పదో తరగతికి రూ.100, ఇంటర్‌కు రూ.200 అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుందని డీఈఓ అంజయ్య, ఓపెన్ స్కూల్ కో–ఆర్డినేటర్ గంధం శ్రీనివాసులు ఓ ప్రకటనలో తెలిపారు.
అభ్యర్థులు తమ దగ్గర్లో ఉన్న స్టడీ సెంటర్ల కో–ఆర్డినేటర్లను సంప్రదించి వారి లాగిన్ ఐడీ ద్వారా దరఖాస్తులను ఆన్‌లైన్ చేయించాలని సూచించారు. అనంతరం వచ్చిన రెఫరెన్స్ నంబరు ఆధారంగా మీసేవా, ఏపీ ఆన్‌లైన్‌లో ఫీజులు చెల్లించాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.