నేటి నుంచి సాంస్కృతిక పోటీలు | Cultural events from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి సాంస్కృతిక పోటీలు

Aug 9 2016 6:17 PM | Updated on Sep 4 2017 8:34 AM

ఆంధ్రవిశ్వవిద్యాలయంలో నేటి నుంచి రెండు రోజులు సాంస్కృతిక పోటీలను నిర్వహిస్తున్నట్లు విద్యార్థి వ్యవహారాల డీన్‌ ఆచార్య పి.హరి ప్రకాష్‌ ఒక ప్రకటనలో తెలిపారు

ఏయూక్యాంపస్‌: ఆంధ్రవిశ్వవిద్యాలయంలో నేటి నుంచి రెండు రోజులు సాంస్కృతిక పోటీలను నిర్వహిస్తున్నట్లు విద్యార్థి వ్యవహారాల డీన్‌ ఆచార్య పి.హరి ప్రకాష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తేదీ ఉదయం 9.30 గంటలకు ఏయూ కామర్స్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలో వ్యక్తిత్వం,వాదం–ప్రతివాదం పోటీలను, ఏయూ ప్లాటినం జూబ్లీ సమావేశ మందిరంలో లలిత సంగీతం, బృందనాగ పోటీలు, 11వ తేదీ ఉదయం 9.30 గంటల నుంచి ఏయూ అసెంబ్లీ మందిరంలో శాస్త్రీయ, బృంద నత్యాలు, మూకాభినయం నిర్వహిస్తారు. ఇప్పటికే తమ పేర్లు నమోదు చేసుకున్నవారు నిర్ణీత తేదీలలో పోటీలలో హాజరుకావాలన్నారు. కష్ణా పుష్కరాలు, స్వాతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement