ఏయూలో నేటి నుంచి సాంస్కృతిక పోటీలు | cultural competetions in au | Sakshi
Sakshi News home page

ఏయూలో నేటి నుంచి సాంస్కృతిక పోటీలు

Aug 10 2016 12:24 AM | Updated on Sep 4 2017 8:34 AM

ఆంధ్రవిశ్వవిద్యాలయంలో బుధవారం నుంచి రెండు రోజులపాటు సాంస్కృతిక పోటీలను నిర్వహిస్తున్నట్లు విద్యార్థి వ్యవహారాల డీన్‌ ఆచార్య పి.హరి ప్రకాష్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

ఏయూక్యాంపస్‌: ఆంధ్రవిశ్వవిద్యాలయంలో బుధవారం నుంచి రెండు రోజులపాటు సాంస్కృతిక పోటీలను నిర్వహిస్తున్నట్లు విద్యార్థి వ్యవహారాల డీన్‌ ఆచార్య పి.హరి ప్రకాష్‌ ఒక ప్రకటనలో తెలిపారు.10వ తేదీ ఉదయం 9.30 గంటలకు ఏయూ కామర్స్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలో వక్తృత్వం, వాదం–ప్రతివాదం పోటీలను, ఏయూ ప్లాటినం జూబ్లీ సమావేశ మందిరంలో లలిత సంగీతం, బృందగాన పోటీలు, 11వ తేదీ ఉదయం 9.30 గంటల నుంచి ఏయూ అసెంబ్లీ మందిరంలో శాస్త్రీయ, బృంద నృత్యాలు, మూకాభినయం పోటీలు నిర్వహిస్తారు. ఇప్పటికే తమ పేర్లు నమోదు చేసుకున్నవారు నిర్ణీత తేదీలలో పోటీలకు హాజరుకావాలన్నారు. కృష్ణా పుష్కరాలు, స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement