బాలుడి కాలులోకి దిగిన గునపం | crowbar crashes into boys feet | Sakshi
Sakshi News home page

బాలుడి కాలులోకి దిగిన గునపం

Jul 20 2016 1:26 PM | Updated on Jul 12 2019 3:02 PM

ఇంట్లో ఆడుకుంటున్న చిన్నారి పాదంలోకి గునపం దూసుకెళ్లడంతో.. ఆ బాలుడు బాధతో విలవిల్లాడిపోయాడు.

కరీంనగర్: ఇంట్లో ఆడుకుంటున్న చిన్నారి పాదంలోకి గునపం దూసుకెళ్లడంతో.. ఆ బాలుడు బాధతో విలవిల్లాడిపోయాడు. ఈ సంఘటన కరీనంగర్ జిల్లా సిరిసిల్ల పద్మనగర్‌లో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న ఓ రెండేళ్ల చిన్నారి ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశత్తు గుణపం జారి బాలుడి పాదంలోకి దూసుకెళ్లింది. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రికి తరలించగా.. రెండు గంటల పాటు శ్రమించిన వైద్యులు ఎట్టకేలకు కాలు నుంచి గుణపాన్ని వేరుచేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement