క్రైస్తవులకు 10శాతం రిజర్వేషన్‌ కల్పించాలి | cristians demand for reservation | Sakshi
Sakshi News home page

క్రైస్తవులకు 10శాతం రిజర్వేషన్‌ కల్పించాలి

Aug 9 2016 11:33 PM | Updated on Sep 4 2017 8:34 AM

క్రైస్తవులకు 10శాతం రిజర్వేషన్‌ కల్పించాలి

క్రైస్తవులకు 10శాతం రిజర్వేషన్‌ కల్పించాలి

క్రైస్తవులకు అన్ని రంగాల్లో 10శాతం రిజర్వేషన్‌ కల్పించాలని క్రిస్టియన్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.జీవరత్నం డిమాండ్‌ చేశారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్రైస్తవులు సమాజంలో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

విజయవాడ(గాంధీనగర్‌) :
 క్రైస్తవులకు అన్ని రంగాల్లో 10శాతం రిజర్వేషన్‌ కల్పించాలని క్రిస్టియన్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.జీవరత్నం డిమాండ్‌ చేశారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్రైస్తవులు సమాజంలో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. క్రిస్టియన్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా నిరుపేద పాస్టర్లకు నెలకు రూ.5వేల ఆర్థిక సాయం అందించాలని, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. క్రైస్తవులపై దాడులను అరికట్టాలన్నారు. క్రిస్టియన్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ సొసైటీ రాష్ట్ర కోశాధికారి చింతా శాంతకుమార్, కో–ఆర్డినేటర్‌ వల్లూరి రవికుమార్, నాయకులు గద్దల ఆదాం, వర్ల రాజా పాల్గొన్నారు. ·
 

Advertisement
 
Advertisement
Advertisement