
సీపీఎస్ విధానం రద్దు చేయాలి
కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్) రద్దు చేయాలని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సరోత్తమ్‌రెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి ఆదిలాబాద్ పట్టణంలోని సంఘ భవనంలో అత్యవసర సమావేశం నిర్వహిం చారు.
► 28న ఢిల్లీలో ధర్నా
►పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సరోత్తమ్‌రెడ్డి
ఆదిలాబాద్ టౌన్ : కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్) రద్దు చేయాలని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సరోత్తమ్‌రెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి ఆదిలాబాద్ పట్టణంలోని సంఘ భవనంలో అత్యవసర సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీపీఎస్ విధానం వల్ల ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం కలుగుతోం దని తెలిపారు. ఈ నెల 28న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర మంత్రి అరుణ్‌జెట్లీకి వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. భా షాపండిత్, పీఈటీ పోస్టులకు సంబంధించిన అప్‌గ్రేడ్ జీవోలను విడుదల చేయాలని అన్నారు.
ఖాళీగా ఉన్న ఉ పాధ్యాయ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని, కామన్ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేశా రు. ఈ సమావేశంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జీవన్, రత్నాకర్‌రెడ్డి, సంఘ బాధ్యులు సత్యానారాయణగౌడ్, రమేష్, రాజన్న, మెట్టు ప్రహ్లద్, సారయ్య, కృష్ణకుమార్, మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.