సాక్షి కొడంగల్, ఆడబిడ్డ పెత్తనం ఉన్న ఇల్లు గొప్పగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే ప్రజాప్రభుత్వంలో మహిళలకు పెద్దపీటవేస్తున్నామన్నారు. సీఎం రేవంత్ సోమవారం తన సొంత నియోజకర్గం కొడంగల్ లో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధిపనులకు శంకుస్థాపన చేశారు. విద్యతోనే పేదల ఇంట్లో వెలుగులు నిండుతాయన్నారు. అందుకే మీ బిడ్డలను ఉన్నత చదువులు చదివించడమే సీఎంగా తన ముందున్న టార్గెట్ అన్నారు. ప్రపంచంతో పోటీపడాలంటే ఎడ్యుకేషన్, ఇరిగేషన్ రెండూ కీలకమని సీఎం తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలందరికి సన్నబియ్యం ఇస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు. త్వరలోనే సర్పంచ్ ఎన్నికలు రానన్నాయని రెండు, మూడు రోజుల్లో దానికి సంబంధించి నోటిఫికేషన్ వస్తుందన్నారు. అభివృద్ధిని అడ్డుకునే వాళ్లను ఎన్నుకోవద్దని, అభివృద్ధి చేసే వారికి అండగా నిలవాలని సీఎం రేవంత్ ప్రజలను కోరారు. కొడంగల్ లోని ప్రతి ఎకరాకు కృష్ణానది నీరు అందిస్తామని త్వరలోనే రూ.ఐదువేల కోట్లతో ఎడ్యుకేషనల్ క్యాంపస్ నిర్మించి కొడంగల్‌ను ఎడ్యుకేషనల్ హాబ్ గా మార్చుతామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.



