హోదా తేవడం చేతగాకే జగన్పై టీడీపీ విమర్శలు | cpi supports ys jagan's deeksha for special status | Sakshi
Sakshi News home page

హోదా తేవడం చేతగాకే జగన్పై టీడీపీ విమర్శలు

Oct 7 2015 7:57 PM | Updated on Mar 23 2019 9:10 PM

హోదా తేవడం చేతగాకే జగన్పై టీడీపీ విమర్శలు - Sakshi

హోదా తేవడం చేతగాకే జగన్పై టీడీపీ విమర్శలు

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తేవడం చేతగాకే అధికార టీడీపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తోందని సీపీఐ జాతీయ నేత సురవరం మండిపడ్డారు.

- వైఎస్ జగన్ దీక్షకు సీపీఐ సంపూర్ణ మద్దతు
- ప్రత్యేక హోదాపై బాబు అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి
- సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం
సుధాకర్ రెడ్డి

న్యూఢిల్లీ:
కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తేవడం చేతగాకే అధికార తెలుగుదేశం పార్టీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం గుంటూరు జిల్లా నల్లపాడు వద్ద వైఎస్ జగన్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు సీపీఐ సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నదని ఆయన చెప్పారు.


టీడీపీ మంత్రులు, ఇతర నేతలు కేవలం బాబును సంతృప్తి పరిచేందుకే జగన్ పై విమర్శలు సంధిస్తున్నారని, ప్రత్యేక హోదాతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని సురవరం స్పష్టం చేశారు. హోదాపై బీజేపీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, ఆ పార్టీపై ఒత్తిడి పెరిగేలా చంద్రబాబు.. అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement