హుస్నాబాద్‌ను కరీంనగర్ జిల్లాలోనే ఉంచాలని సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని మల్లెచెట్టు చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు.
హుస్నాబాద్: హుస్నాబాద్‌ను కరీంనగర్ జిల్లాలోనే ఉంచాలని సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని మల్లెచెట్టు చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. మోకాళ్లతో నడుస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజల మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాలకు విఘాతం కలిగించి హుస్నాబాద్ నియోజకవర్గాన్ని మూడుముక్కలు చేయడం శ్రేయస్కరం కాదన్నారు.
కొందరి నాయకులు ఉనికిని చాటుకునేందుకు ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. పోరాటాల గడ్డ హుస్నాబాద్ ఉనికి లేకుండా ఇతర జిల్లాలో కలపడం సరికాదన్నారు. హుస్నాబాద్‌ను కరీంనగర్‌లోనే ఉంచాలని ప్రజలు తమ అభిప్రాయాలను ముక్తకంఠంతో వెలిబుచ్చినా సిద్దిపేటలో కలిపే కుట్రను ఉపసంహరించుకోవాలని కోరారు. హుస్నాబాద్ చరిత్రను కనుమరుగు చేసేలా ఈ ప్రాంత అస్థిత్వాన్ని దెబ్బతీసే చర్యల్లో భాగమే హుస్నాబాద్ విభజన అని పేర్కొన్నారు. సీపీఐ మండల కార్యదర్శి కొయ్యడ సృజన్‌కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు పెండెల అయిలయ్య. పట్టణ కార్యదర్శి గడిపె మల్లేష్, నాయకులు ఎడల వనేష్, మేడవేని సారయ్య, బొల్లి సమ్మయ్య, ఇప్పకాయల సహదేవ్, పిట్టల నారాయణ, జంపయ్య, భిక్షపతి, రఘుపతి, సంజీవరెడ్డి, దుర్గేశం, జనార్దన్, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.